జగన్ అవగాహన శూన్యతపై చంద్రబాబు సెటైర్లు!

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనేది భారతీయ జనతా పార్టీ నినాదంగా ఎన్నడో ప్రజల్లోకి వెళ్లింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనే కసరత్తుకు అనేక పరిమితులు ఉన్నప్పటికీ కూడా.. కేవలం ఎన్నికల పేరుతో.. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రతి అయిదేళ్లకు ఒకసారి వృథా చేయకుండా ఉండడం కోసం ఎన్డీయే సర్కారు జమిలి ఎన్నికల ఆలోచన చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది. అయితే ‘దేశంలో ఇక మీద జమిలి ఎన్నికలు జరగబోతున్నాయి’ అనే అంశాన్ని పట్టుకుని నాయకులు ఎవరికి వారు తమకు అనుకూలంగా మాట్లాడుకోవడానికి తపన పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిలోని అవగాహన రాహిత్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెటైర్లు వేస్తున్నారు. జమిలి గురించి అవగాహన లేని వైసీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు అంటున్నారు.

జమిలి ఎన్నికల బిల్లు చట్టసభ్లలో ఆమోదం పొందినంత మాత్రాన.. వెంటనే ఎన్నికల రావడం అనేది అసాధ్యమని చంద్రబాబు అంటున్నారు. జమిలి కార్యరపం దాలిస్తే.. 2029కి ముందు దేశంలో ఎన్నికలు జరిగే అవకాశమే లేదని అంటున్నారు.

సాంకేతికంగా చూసినప్పుడు.. చంద్రబాబునాయుడు చెబుతున్న మాటే కరెక్టు. ఎందుకంటే.. 2029కి ముందు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు గడువు పూర్తయితే.. మిగిలిన కాలాన్ని బట్టి.. ఎన్నికలు నిర్వహించాలా లేదా 2029 వరకు వెయిట్ చేయాలా? అని ఎన్నికల సంఘం ఆలోచించవచ్చు. ఎందుకంటే.. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వానికి గడువు పూర్తయిపోయింది కాబట్టి.. దేశమంతా ఉండే పార్లమెంటును గడువుకు ముందే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని పురమాయించడం సబబుగా ఎన్నికల సంఘం భావించదు. కాబట్టి జమిలి ఎన్నికలు రావడం అంటే దాని అర్థం.. దేశమంతటా కూడా ఒకేసారి జరగవలసిన పార్లమెంటు గడువు పూర్తయిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది అనేది నిజం.

అయితే జగన్మోహన్ రెడ్డి.. అప్పటిదాకా తన పార్టీ బతికుంటుందో లేదో అనే భయంతో పాటు, చంద్రబాబు ప్రభుత్వం పూర్తికాలం ఉండదు అని ప్రచారం చేసే కుట్రతో.. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని అంటున్నారనేది ప్రజల భావన. తొందర్లో ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పుకుంటూ ఉంటే.. పార్టీ నాయకులు వెళ్లిపోకుండా కాపాడుకోవచ్చునని జగన్ భయపడుతున్నారేమో తెలియదు.

Related Posts

Comments

spot_img

Recent Stories