మరో భాషలో గేమ్‌ ఛేంజర్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ,  తెలుగింటి ముద్దుగుమ్మ అంజలి కాంబోలో సెన్సేషనల్ డైరెక్టర్‌ శంకర్ డైరెక్షన్‌ లో తీర్చిదిద్దుతున్న మోస్ట్  అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”. చరణ్ సహా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ తో పాటు ఇప్పుడు పలు ఈవెంట్స్ కి రంగం సిద్ధం చేస్తుండగా ఈ సినిమా విడుదల గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినపడుతుంది.

మేకర్స్ ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మాత్రమే విడుదల ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు మరో భాషలో కూడా గేమ్ ఛేంజర్ అభిమానుల  ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం  ప్రకారం గేమ్ ఛేంజర్ కన్నడలో కూడా విడుదల అవ్వబోతుందంట. ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్టు టాక్. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories