జాతీయ నటుడు అల్లు అర్జున్ తన తాజా సినిమా పుష్ప 2 తో మాత్రమే కాకుండా తన అరెస్ట్ విషయంలో కూడా మరోసారి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే తన సినిమా పుష్ప 2 దర్శకుడు సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఎలాంటి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే.
వీరి బాండింగ్ ఇప్పటి నుంచి కాదు ఆర్య నుంచి మొదలైన వీరి ప్రయాణం ఇపుడు పుష్ప 2 వచ్చేసరికి మరింత బలంగా ఎమోషనల్ గా ముడిపడిందని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యి వచ్చాక సుకుమార్ కలిసి కనిపించిన ఎమోషనల్ విజువల్స్ వైరల్ గా అవుతున్నాయి.
అల్లు అర్జున్ తో మాట్లాడుతూ సుకుమార్ కంటతడి పెట్టుకున్న దృశ్యాలు చూస్తే వీరి మధ్య ఎలాంటి బంధం ఉందో తెలుస్తుందని అభిమానులు అంటున్నారు. దీనితో వీరిద్దరిపై వీడియోలు వైరల్ గా మారాయి.