ఒక వైపు అల్లు అర్జున్ అరెస్ట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీ అట్టుడుకిపోతోంది. ఇంకో వైపు సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం కూడా ఇంకా పోలీసులు చుట్టూ తిరుగుతోంది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంట్లోనే చూసుకోవాలి అని రాజకొండ సీపీ మొత్తం కుటుంబానికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. నటుడు మోహన్‌బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం ఆయన కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు గానూ మోహన్‌బాబుపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం కేసును పోలీసులు రిజిస్టర్ చేశారు. తక్షణమే మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని పోలీసులు అనుకుంటున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మంగళవారం జల్పల్లిలోని తన నివాసంలో జర్నలిస్టుపై మైకులతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నేపథ్యంలో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటీషన్ దాఖలు చేశారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేసిన తెలంగాణ కోర్టు మోహన్ బాబుకు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ పిటీషన్ ని తిరస్కరించింది.