మీడియాకి క్షమాపణలు చెప్పిన మోహన్‌ బాబు!

మంచువారి కుటుంబంలో నెలకొన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. మోహనబాబు చిన్నకుమారుడు మనోజ్‌, మోహన్‌బాబు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కేసులు పెట్టుకోవడం వంటివి తెలిసిందే.ఈ క్రమంలో సీపీ ఇరువురికి వార్నింగ్‌ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబు ఓ మీడియా రిపోర్టర్ పై అమానుషంగా దాడి చేయడం జరిగింది.

దీంతో ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. అయితే ఈ ఘటనపై మోహన్ బాబు తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను గత 48 గంటల నుంచి హాస్పిటల్ లోనే ఉన్నాను అని అందుకే ఆ ఘటనపై వెంటనే స్పందిచలేకపోయాను అని చెప్పుకొచ్చారు. ఆ హీట్ మూమెంట్ లో నా ఇంటి గేటు బద్దలుకొట్టారు.

దాదాపు 30 నుంచి 50 మంది ఎవరో వచ్చేసారు. దీనితో నేను నా సహనం కోల్పోయాను ఆ సమయంలో జరిగిన దాడిపై చింతిస్తున్నాను అని అలాగే ఆ ఛానెల్ వారికి అతని కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పారు.

Related Posts

Comments

spot_img

Recent Stories