నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “డాకు మహారాజ్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా కొంచెం తక్కువ అప్డేట్స్ వస్తున్నప్పటికీ వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా అంచనాలు పెంచుతూ వచ్చింది.
మరి అలా టైటిల్ గ్లింప్స్ తో ఒక్కసారిగా మరిన్ని అంచనాలు పెరిగిపోగా ఇపుడు సినిమా ఫస్ట్ సింగిల్ తాలూకా ప్రోమోని అయితే మేకర్స్ విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మరి ఈ ప్రోమో పవర్ఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాలయ్యతో సంగీత దర్శకుడు థమన్ కి సాలిడ్ హిట్ ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే.
మరి దీంతో మరోసారి బాలయ్య కోసం థమన్ సాలిడ్ డ్యూటీ ఎక్కాడని ఈ ప్రోమో వింటే ఇట్టే అర్థం అయిపోతుంది. మాంచి పవర్ఫుల్ బీట్స్ తో మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన చార్ట్ బస్టర్ ని అందిస్తున్నట్టుగా తెలిసిపోతుంది. మరి ఈ అవైటెడ్ ఫుల్ సాంగ్ ఈ డిసెంబర్ 14 న విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.