కొత్త జీవితంలోకి మహానటి

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్  గురించి తెలుగు  ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో ప్రస్తుత తెర మహానటి అని అనిపించుకుంది. ఇలా తెలుగు తో పాటు తమిళ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇపుడు తన పర్శనల్ లైఫ్ లో ఓ అడుగు ముందుకు వేసింది..

కొన్ని రోజులు కితమే తన ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ అయిన కీర్తి ఇపుడు ఫైనల్ గా తన పెళ్లి చేసేసుకుంది. తన చిరకాల ప్రేమికుడి ఆంటోనీని నేడు గోవాలో వివాహం చేసుకోగా ఆ పెళ్ళికి సంబంధించిన పలు బ్యూటిఫుల్ విజువల్స్ ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఇద్దరు నవ దంపతులు తమ ప్రేమ పెళ్లి ఆనందం వారి ముఖాల్లోనే కనిపిస్తుంది.

ఇలా పలువురు సినీ ప్రముఖులు సహా కుటుంబీకుల సమక్షంలో వీరి పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. దీంతో ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా సినీ ప్రముఖులు వీరికి తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories