ఆ ప్రముఖ ఓటీటీతో కార్టూన్‌ నెట్‌వర్క్‌ ఒప్పందం!

ప్రపంచవ్యాప్తంగా  ఉన్నటువంటి పాపులర్ కార్టూన్ ఛానెల్స్ లో కార్టూన్ నెట్వర్క్ అంటే తెలియని ఎవరూ ఉండరు. ఇంగ్లీష్ ఆడియెన్స్ నుంచే కాకుండా మన తెలుగుతో సహా ఇండియన్ భాషల్లో దాదాపు అందరికీ ఈ ఛానెల్ కానీ అందులో షోస్ కానీ తెలిసే ఉంటాయి. అయితే ఈ ఛానెల్ ఎన్నో ఏళ్ళు తరబడి ఎంటర్టైన్మెంట్ ని అందించింది.

కానీ ఈ మధ్య లోనే ఎన్నోసార్లు ఛానెల్ ఆపేస్తున్నారని పలు మాటలు కూడా వినిపించేవి. కానీ ఫైనల్ గా ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్‌ అయితే బయటకి వచ్చింది. కార్టూన్ నెట్వర్క్ లోని పలు పాపులర్ షోస్ ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ సొంతం చేసుకుంది. కాకపోతే అందులో కూడా సబ్ స్క్రిప్షన్ తీసుకొనే చూడాలంట.

మరి ఆ ఓటీటీ యాపే అమెజాన్ ప్రైమ్ వీడియో. వీరితో కార్టూన్ నెట్వర్క్ ఒప్పందం చేసుకోగా అందులో ఆ ఛానెల్ వారి కొన్ని క్లాసిక్ కార్టూన్స్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీటిని చూడాలి అంటే ప్రైమ్ వీడియోలో ఏడాదికి 199 చెల్లించాలంట.

Related Posts

Comments

spot_img

Recent Stories