డెడికేషన్‌ అంటే ఇదే!

ప్రస్తుతం మంచు వారి కుటుంబంలో జరుగుతున్నా రగడ గురించి అందరికీ తెలిసిందే. అయితే యంగ్ హీరో మంచు మనోజ్ అలాగే తన తండ్రి మంచు మోహన్ బాబు సహా మంచు విష్ణు లతో కొన్ని వ్యక్తిగత విషయాల గురించి పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరి వైపు న్యాయం, అన్యాయం ఉన్నాయి అనేది పక్కన పెడితే వారి కుటుంబంలో మాత్రం మంచి హీట్ వాతావరణం కనిపిస్తుంది.

ఓ పక్క మంచు విష్ణు తన భారీ చిత్రం కన్నప్ప పనులు వదులుకొని హైదరాబాద్ కి రాగా ఈ గొడవల్లోనే తాజాగా మంచు మనోజ్ షూటింగ్ లో జాయిన్‌ అయినట్టుగా తెలుస్తుంది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు విజయ్ కనకమేడల కాంబో లో చేస్తున్న చిత్రమే “భైరవం”.

సాలిడ్ మాస్ మూవీగా చేస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ కూడా యాక్ట్‌ చేస్తున్నాడు. మరి ఫైనల్ గా తమ కుటుంబ గొడవలు జరుగుతున్నప్పటికీ మనోజ్ షూటింగ్ కి ఇచ్చిన తేదీలను స్పాయిల్ చెయ్యకుండా తన డెడికేషన్ చూపిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories