బ్రదర్స్ కొట్లాట : పనిష్మెంట్ మోహన్ బాబుకా?

ఉరుమురిమి మంగలం మీద పడిందని సామెత! ఇప్పుడు మంచు కుటుంబంలో పుట్టిన వివాదం, దాని పర్యవసానంగా జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. నిజానికి ఈ వివాదంలో మంచు మోహన్ బాబు ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదు. చాలా తక్కువ అని చెప్పాలి. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తులకు సంబంధించి, ఆధిపత్యానికి సంబంధించిన వివాదం మాత్రమే ఈ కొట్లాట. మనోజ్ వివాదాన్ని దాడులు, చొరబాట్ల స్థాయికి తీసుకువెళ్లే సమయానికి విష్ణు దేశంలో లేకపోవడం, విష్ణు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు వ్యవహారాల్ని మోహన్ బాబు తాను స్వయంగా చూడవలసి రావడమే ఇప్పుడు ఆయన పాలిట శాపమైంది. సహజంగానే కాస్త దూకుడు ఉన్న మోహన్ బాబు, మీడియా వారు చొరబడినప్పుడు ఆ ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఆయన మీద ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు అయింది. ప్రస్తుతానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్నారు.

శ్రీవిద్యానికేతన్ ఆస్తుల నిర్వహణ, యాజమాన్య హక్కులు తదితర వ్యవహారాలకు సంబంధించి.. చాలా కాలంగా మంచు మనోజ్ గొడవ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇద్దరూ కూడా విద్యానికేతన్ నుంచి తమకు ప్రతినెలా కొంత నిర్ణీత మొత్తం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చాలా కాలం ముందునుంచే ఒత్తిడి చేసి విఫలమైనట్టుగా కూడా పుకార్లున్నాయి. అయితే తాజాగా మనోజ్ తనకు ఆస్తులు గానీ, డబ్బులు గానీ అక్కర్లేదు అని అంటూనే.. తండ్రి ఇంటి మీదికి తన బౌన్సర్లను కూడా వెంటబెట్టుకుని దాడికి వెళ్లారు. ప్రహరీ తలుపులు వేసి ఉంటే.. వాటిని బలవంతంగా పగులగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారు. అది ప్రెవేటు ప్రాపర్టీ. మోహన్ బాబుకు చెందిన ఇల్లు. మంచు మనోజ్ పిలిచినందుకు ఆయన వెంట వెళ్లిన మీడియా వాళ్లు పోలోమని లోపలకు వెళ్లిపోయారు. మీడియా వాళ్లను వెళ్లిపోవాలని చేతులెత్తీ దండం పెడుతూ ముందుకొచ్చిన మోహన్ బాబు వద్దకు ఒక టీవీచానెల్ విలేకరి.. దూసుకెళ్లిపోయిన ఆయన మొహం మీద మైకు పెట్టి ఆయన స్పందన చెప్పాల్సిందిగా కోరడంతో ఆయన రెచ్చిపోయారు. ఆ మైకును లాక్కుని ఆ రిపోర్టునే మొహం మీద కొట్టారు. అతనికి గాయమైంది. జర్నలిస్టు సంఘాలు సదరు టీవీఛానెల్ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నాయి. అదే సమయంలో మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

అసలు బౌన్సర్లను మెయింటైన్ చేస్తూ.. వారితో ఘర్షణలకు కారణమైన అన్నాదమ్ములు విష్ణు, మనోజ్ ఇద్దరూ కేవలం పోలీసు కమిషనర్ వార్నింగులతో తప్పించుకున్నారు. కానీ.. మోహన్ బాబు మాత్రం హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన ఇబ్బంది పడతారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories