మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్నాడు. ఆయన రీసెంట్‌గా ‘విశ్వం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తన తరువాత చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అని గోపీచంద్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, గోపీచంద్ తాజాగా ఓ యంగ్ డైరెక్టర్‌కి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి చెప్పిన ఓ కథకు గోపీచంద్ ఓకే చెప్పాడని సమాచారం. గతంలో ఘాజీ, అంతరిక్షం వంటి ఔట్ ఆఫ్ ది బాక్స్ చిత్రాలను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి, ఈసారి అందుకు భిన్నంగా ఓ కథను రెడీ చేశాడని సమాచారం.
ఈ కథను గోపీచంద్‌కు వినిపించగా, అది ఆయనకు నచ్చిందని టాక్.మరి నిజంగానే రెడ్డి గారి కథ మ్యాచో స్టార్‌కి నచ్చిందా.. అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక తన తరువాత సినిమాతో ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని హీరోతో పాటు దర్శకుడు కూడా గట్టిగా అనుకుంటున్నారంట.