నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న విషయం తెలిసిందే. “డాకు మహారాజ్” అంటూ చేసిన ఈ మాస్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ని కూడా బాలయ్య ఆల్రెడీ పూర్తి చేసేశారని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి సెన్సేషనల్ సీక్వెల్ “అఖండ 2” రానుంది. మరి డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య అలా డాకు మహారాజ్ పూర్తి చేసిన వెంటనే అఖండ 2 లోకి ఎంట్రీ ఇచ్చేసినట్లు తెలుస్తుంది.
దీంతో వెంటనే అఖండ 2 పనులని తాను మొదలు పెట్టిసినట్లు తెలుస్తుంది. మరి ఈ సెన్సేషనల్ సీక్వెల్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి తన డాకు మాహారాజ్ మాత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు తీసుకుని వస్తున్నారు.