టాలీవుడ్ యాక్టర్స్‌లో ప్రభాస్‌కి ఎంతటి పేరుందో అందరికీ తెలిసిందే. అయితే, ఆయన తన సినిమాలో పనిచేసే ఇతర నటీనటులకు ఎలాంటి అతిథ్యం ఇస్తారో ఇప్పటికే చాలా మంది స్టార్స్ పలు ఇంటర్వ్యూలలో వివరించారు. ప్రభాస్ ఇంటి నుండి వచ్చే భోజనం నిజమైన బాహుబలి అని పలువురు కామెంట్లు కూడా చేస్తుంటారు.
ఇక ప్రభాస్ ఇచ్చే ఫుడ్ ట్రీట్ కూడా ఆ రేంజ్లో ఉంటుందని ఆయన్ను సన్నిహితంగా చూసినవారు చెబుతారనే విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాడు ప్రభాస్. విలక్షణ నటుడు జగపతి బాబు తాజాగా ప్రభాస్ విందు భోజనానికి ముగ్ధుడయ్యాడు. భీమవరంలో ఓ సినిమా షూటింగ్‌కి వచ్చిన తనకు వివాహ భోజనాన్ని తలపించే భోజనం రాజుగారు పంపించారని.. దీన్ని బకాసరుడిలా తిని కుంభకర్ణుడులా పడుకున్నానని జగపతి బాబు తాజాగా ఓ వీడియో లో చెప్పుకొచ్చాడు. ఇలా భోజనంతో చంపేయడం భీమవరం రాజులకే సొంతం అని ఆయన ఈ వీడియో లో అన్నారు.