రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ద గర్ల్ ఫ్రెండ్’. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ బయటకు వచ్చింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. పైగా విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగింది ‘నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా’ అంటూ విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక విజువల్స్ సూపర్ గా ఉన్నాయి.
మొత్తానికి టీజర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచింది.ముఖ్యంగా టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనపడుతున్నాయి. మొత్తానికి ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందని తెలుస్తోంది. కాగా ‘ద గర్ల్ ఫ్రెండ్’ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. బహుశా ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదల కానుందని టాక్ నడుస్తుంది.