రాజధాని టెండర్లు పూర్తి : డెడ్‌లైన్లతో సాగనున్న పనులు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు తనకు ఇచ్చిన ఒక్క చాన్స అనే దనిని అత్యంత ఘోరంగా వాడుకుంటూ.. ప్రజలు కలలు గనిన అమరావి రాజధానిని అయిదేళ్లపాటు విస్మరించారు. రైతులు స్వచ్ఛందంగా రాజధాని కోసం భూములు ఇస్తే.. తన వ్యక్తిగత కక్ష్లలు, కుత్సితమైన బుద్ధులతో అసలు ఆ ప్రాంతాన్నంతా స్మశానంలా మార్చేశారు. సగం పూర్తయిన భవనాల పూర్తి గురించి కూడా పట్టించుకోకుండా.. అయిదేళ్లపాటూ దుర్మార్గం గా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని  అనే స్వప్నానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అనల్పమైన ద్రోహాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈసారి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలకు స్పష్టమైన, జాప్యంలేని డెడ్ లైన్లు విధించి మరీ పనులు అప్పగిస్తుండం గమనార్హం. ప్రభుత్వం దూకుడును గమనిస్తోంటే.. ఒక ఏడాది తిరిగేలోగానే.. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణలు కొన్ని పూర్తయి.. నగరం రూపుదిద్దుకోవడం మొదలవుతుందని అంతా ఆశిస్తున్నారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇచ్చిన నిర్మాణ కాంట్రాక్టు పనులు పూర్తిచేయడానికి అప్పట్లో అప్పగించిన గడువు ఎప్పుడో గడచిపోయింది. జగన్ సర్కారు పుణ్యమాని.. ఆ అయిదేళ్లు ఆయా సంస్థలు ఏ పనులూ చేయలేకపోయాయి. దీంతో.. పనులు స్తంభించాయి. ఇప్పుడు అన్ని టెండర్లను రద్దు చేసేసి.. మళ్లీ కొత్తగా టెండర్లు పూర్తిచేశారు. ఇవాళ టెండర్లు కేటాయించే ప్రక్రియ కూడా పూర్తయిది.

హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ప్రభుత్వం కొనుగోలు చేసిన వారికి పాత ధరలకే పూర్తిచేసి అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఆ నిర్మాణ పనులు నాగర్జున కన్ స్ట్రక్ష్సన్స్ సంస్థ దక్కించుకుంది. అలాగే మొత్తం 1872 కోట్ల రూపాయల వ్యయంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, ఐఏఎస్ ల కోసం అపార్ట్ మెంట్లు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు ఇవన్నీ కూడా చేపట్టడానికి టెండర్లు కొత్తగా కేటాియంచడం జరిగింది.
డిసెంబరు 15నుంచి ఈ పనులన్నీ మొదలు కానున్నాయి. శసనసభ్యులు, ఐఏఎస ల క్వార్టర్లు పూర్తిచేయడానికి కేవలం ఆరునెలల గడువు విధించారు.

గెజిటెడ్ అికారులు మంత్రుల  బంగ్లాలు తదితర 9 నెలల్లో పూర్తి కాబోతున్నాయి. అంటే ఇంచుమంచుగా ఈ 9 నెలల వ్యవధిలో కేవలం కీలక అధికార్ల, నాయకుల నివాస భవనాలు పూర్తి కావడం అంటే.. వాటికి తగినట్టుగా రోడ్లు తదితర ఇన్ ఫ్రా స్ట్రకచర్ పనులు కూడా పూర్తవుతాయని అనుకోవచ్చు. తక్కువ డెడ్ లైన్లు విధించి పనులు జరిగేలా కొత్త ప్రభుత్వం పూనిక వహిస్తుండడం గమనిస్తే త్వరలోనే అమరావతికి ఒక రూపు వస్తుందని అంతా ఆశిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories