ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తీర్చిదిద్దగా.. పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను స్టన్ చేయబోతుందని మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులుఎంతో ధీమాగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉంటుందా.. అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా నిలిచింది. గతంలో ‘పుష్ప-3’ గురించి కొన్ని వార్తలు వచ్చినా, మేకర్స్ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి సమాచారాన్ని అందించలేదు.
ఇక తాజాగా జరిగిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ దీనిపై సరదాగా ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు. బన్నీ మరో మూడేళ్లు సమయాన్ని కేటాయిస్తే, పుష్ప-3 చేసేస్తానని అన్నారు. అయితే, పుష్ప-2 క్లైమాక్స్‌లో పుష్ప-3 మూవీకి సంబంధించిన లీడ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
తాజాగా దీనికి సంబంధించి ఓ ఎడిటింగ్ రూమ్ ఫోటో నెట్టింట షికారు చేస్తుంది. ‘పుష్ప 3 – ది ర్యాంపేజ్’ అనే టైటిల్‌తో ‘పుష్ప 2’కి సీక్వెల్ మూవీ రాబోతుందని ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. మరి నిజంగానే ఇదే టైటిల్‌ను మేకర్స్ మనకు ‘పుష్ప-2’ క్లైమాక్స్‌లో చూపించనున్నారా అని సందేహం వెల్లడవుతుంది.