పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి.
అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాజకీయంగా చాలా బిజీగా ఉన్న పవన్, ఇప్పుడు కొంత సమయాన్ని తన సినిమా కోసం ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేగాక, షూటింగ్ సెట్స్ నుండి ఓ సెల్ఫీ ఫోటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇలా పవన్ తిరిగి షూటింగ్ సెట్స్‌కి రావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్‌గా బిజీ ఉన్నప్పటికీ, సినిమా కోసం సమయం తీసుకుని షూటింగ్లో పాల్గొనడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.