భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రావడానికి కేవలం రెండు రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ మూవీని ముందు నుంచి కూడా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు మూవీమేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఎంతో వేడుకగా చేశారు.
ఈ ఈవెంట్ కి అతిథిగా టాలీవుడ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రమోషన్స్ అవసరమే లేని సినిమా పుష్ప 2. యావత్ భారత దేశం ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంది అంటే, అంతకన్నా వేరే ప్రమోషన్స్ అవసరం లేదని చెప్పుకొవచ్చు. తెలుగు చిత్రపరిశ్రమలో జాతీయ అవార్డు అందుకున్న నటుడు అల్లు అర్జున్.
పుష్ప 2 సినిమాతో తన స్థాయిని మరింత పెంచుతారని అనుకుంటున్నాను. సుకుమార్ ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం గ్యారంటీ.” అనిరాజమౌళి అన్నారు.