నటసింహం బాలయ్య బాబుని ఇండస్ట్రీకి సరికొత్తగా చూపించిన టాక్ షో.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సూపర్ హిట్ టాక్ షో బుల్లితెర మీద దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ షో 4వ సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమంలో నటీనటులు శ్రీలీల, నవీన్ పొలిశెట్టి పాల్గొని సందడి చేశారు.
వీరిద్దరూ తమ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఇంగ్ట్రెస్టింగ్ విశేషాలను బాలయ్య బాబుతో పంచుకున్నారు.ఇందులో భాగంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘‘(బాలయ్య) సర్.. మీరు ఎమ్మెల్యే.. నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్’’ అని సరదాగా నవ్వులు పూయించాడు.
ఈ క్రమంలోనే గతంలో తానొక చిప్స్ బ్రాండ్ ప్రకటన ఆడిషన్‌కు వెళ్తే.. తనకు సిక్స్ ప్యాక్ లేదని తనని వద్దన్నారని పొలిశెట్టి చెప్పాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు కురిశాయి. అనంతరం ‘కిస్సిక్’ పాటకు శ్రీలీల, నవీన్ పొలిశెట్టిలతో పాటు బాలయ్య కూడా స్టెప్పులు వేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.