అక్కినేని వారి ఇంట మరో శుభకార్యం జరగబోతుంది. ఇప్పటికే డిసెంబర్ 4న నాగ చైతన్య , శోభితా పెళ్లి జరుగుతుండగా..చిన్న కుమారుడు కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున నే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జైనబ్ తమ కోడలు అవుతున్నట్లు తెలిపారు.
జైనబ్ తో మా చిన్న కుమారుడి నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్ ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులందరికీ మీ ఆశీస్సులు కావాలి అంటూ నాగార్జున పోస్ట్ చేశారు.
ఈ విషయం గురించి అఖిల్ కూడా అభిమానులతో పంచుకున్నారు. కేవలం ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్యనే జరిగినట్లు తెలుస్తుంది. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కూడా. డిసెంబర్ 4న నాగ చైతన్య -శోభితల వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో మరో శుభకార్యం జరగడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా అఖిల్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అఖిల్ నుంచి కొత్త సినిమా వస్తుందనుకుంటున్న తరుణంలో ఈ పెళ్లి వార్త చెప్పి అందర్ని ఆశ్చర్య పరిచారు.