కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్పడిన 1750 కోట్ల రూపాయల సింగిల్ డీల్ అవినీతి బాగోతంపై విచారణ జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. న్యాయనిపుణులతో చర్చించడమూ, అవినీతి నిరోధక చట్టం కింద జగన్ మీద కేసులు నమోదు చేయడం గురించి, దీనికి సంబంధించి.. 17ఏ సెక్షన్ నిర్దేశించే ప్రకారం గవర్నరు దగ్గర అనుమతులు తీసుకోవడం గురించి ప్రభుత్వమూ, పోలీసులూ ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఈలోగానే  జగన్ మీద విచారణ మొదలైపోయేలా ఉంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా.. రాష్ట్రప్రభుత్వం ప్రయత్నంతో నిమిత్తం లేకుండా.. సుప్రీంకోర్టు నుంచే ఈ వ్యవహారంలో విచారణకు  ఆదేశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదానీ- రాష్ట్ర ప్రభుత్వాలకు ముడుపులు ఇచ్చి సెకితో ఒప్పందాలు కుదుర్చుకునేలా చేసిన వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో డొంకంతా కదిలే అవకాశం కనిపిస్తోంది.

అమెరికాలో ఎఫ్‌బిఐ నమోదు చేసిన కేసు.. అదానీ ముడుపులు, లబ్ధి పొందిన జగన్ తదితరుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. భారత్ లో విద్యుత్తు ఒప్పందాలకోసం అదానీ గ్రూపు 2029 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిన వ్యవహారం ఇది. గౌతం అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో అభియోగాలు నమోదై ఉన్నాయి. ఈ వ్యవహారంపై మన దేశంలో కూడా పూర్తిస్థాయి విచారణ సాగాలని విశాల్ తివారీ తన పిటిషన్ లో కోరుతున్నారు.

సాధారణంగా ఒక నాయకుడికి ఇబ్బంది కలిగేలా ఒక కోర్టు కేసు నమోదు అయితే.. ప్రత్యర్థి పార్టీ వారే బినామీ వ్యక్తుల పేరుతో అలాంటి కేసు వేయించారని వారు బుకాయించడానికి అవకాశం ఉండేది. జగన్ ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయాలపై అనేక  ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనప్పుడు.. ప్రభుత్వంలోని పెద్దలు తెలుగుదేశమే బినామీ వ్యక్తుల పేర్లతో ఇలాంటి కేసులు వేయిస్తున్నదని ఆరోపించడం మనం గమనించాము. అయితే ఇప్పుడు విశాల్ తివారీ వ్యవహారంలో సానుకూల తీర్పు వస్తే జగన్ మెడకు చుట్టుకుంటుంది గానీ.. ఆయనతో తెలుగుదేశమే పిటిషన్ వేయించందని అనడానికే వీల్లేదు. ఎందుకంటే ఆయనకు ఇదివరలో కూడా దేశ రాజకీయాలను కుదిపేసిన అనేక వ్యవహారాల్లో ఇలాంటి పిటిషన్లు వేసిన అనుభవం ఉంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ పై దర్యాప్తు కోరుతూ ఆయన గతంలోనూ పిటిషన్ వేశారు. ఇప్పుడు సెకి ఒప్పందాలపై పిటిషన్ వేశారు. తక్ష్ణ విచారణ కోరుతూ విశాల్ తివారీ మెన్షన్ చేయబోతున్నారు గానీ.. పిటిషన్ ఎన్ని  మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories