అవునా.. జగన్ అంత శాడిస్టిక్‌గా ప్రవర్తించారా?

అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా ప్రత్యేకదళాలు చుట్టుముట్టి చంపుతున్నప్పుడు.. ఆ దృశ్యాలను  ఆ దళాల్లోని వారి శిరస్త్రాణాలకు అమర్చిన కెమెరాల ద్వారా ప్రసారం చేయించుకుని.. తన వైట్ హౌస్ నివాసంలోంచి తనివితీరా బరాక్ ఒబామా తిలకించారు. లాడెన్ ను చంపించడాన్ని సమర్థించిన వారు కూడా.. ఆ హత్యాపర్వాన్ని స్వయంగా ‘లైవ్’లో చూడాలనుకున్న ఒబామా శాడిజం గురించి ఈసడించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో  కూడా అలాంటి శాడిజం ఉన్నదా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. శాసనసభో చేసిన ఆరోపణలు గమనిస్తే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం కలుగుతుంది.

చంద్రబాబునాయుడును గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరాచకంగా అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత అమానుషంగా అరెస్టు చేయడం మాత్రమే కాదు.. 52 రోజుల పాటు జైల్లో మగ్గేలా చేశారు. పవన్ కల్యాణ్ లో ఆవేశం పెచ్చరిల్లి.. కూటమి బంధానికి  సంబంధించి తొలి అధికారిక ప్రకటన కూడా ఈ నేపథ్యంలోనే రావడం వేరే సంగతి.

అయితే చంద్రబాబునాయుడు జైల్లో ఉన్న రోజుల్లో  అక్కడున్న సీసీ కెమెరాల పాస్ వర్డ్ ను జైలు అధికారులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేశారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. అంటే.. చంద్రబాబునాయుడు జైల్లో ఏ రకంగా మగ్గుతున్నారో, ఏరకంగా ఇబ్బందులు పడుతున్నారో లేదా, ఏరకంగా మధనపడుతున్నారో జగన్ గమనిస్తూ కూర్చున్నారన్నమాట. సీసీ కెమెరాల పాస్ వర్డ్ ఇవ్వడం అంటే.. చంద్రబాబును ములాఖత్ ల పేరుతో వచ్చి కలుస్తున్న వారితో ఉండే దృశ్యాలన్నీ కూడా అప్పట్లో జగన్ చూసి ఉండడానికి ఆస్కారం ఉంది. ఇది ఆయనలోని శాడిజానికి పరాకాష్ట కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అప్పటి జైళ్ల శాఖ డీఐజీ  రవికిరణ్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని కూడా బొలిశెట్టి కోరుతున్నారు.

ఇంకా, పవన్ కల్యాణ్ ను విశాఖలో అడ్డుకున్న పోలీసులు, రక్తస్రావం అవుతున్నా అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేసి కారులో వందల కిలోమీటర్లు తరలించిన పోలీసులను, రఘురామక్రిష్ణ రాజును హింసించిన పోలీసులను కూడా విచారించాలని బొలిశెట్టి కోరుతున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. చంద్రబాబు జైల్లో ఉండగా.. ఆ సీసీ టీవీలను జగన్ పాస్ వర్డ్ ద్వారా లైవ్ లో చూశారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక గా మారుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories