అమ్మకు ప్రేమతో..!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి కంటెంట్ ఉండేలా ఆయన జాగ్రత్త పడుతున్నారు.

ఇక ఆయన నుండి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతుండటంతో నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే, తాజాగా తన కన్నతల్లికి ఓ ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు ఈ హీరో.

త్వరలోనే తన తల్లి కనకదుర్గ పుట్టినరోజు వస్తున్న క్రమంలో, ఆమెకు బర్త్ డే గిఫ్ట్‌గా ఈ కారును కొని అందజేసినట్లు సందీప్ కిషన్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసి తెలిపాడు. తన తల్లి ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తుందని.. ఆమెకు కొడుకుగా ఎప్పటినుండో ఓ కారును కొనివ్వాలని తాను చూశానని.. ఇప్పుడు ఆ తరుణం రావడంతో ఆమెకు ఈ కారును బహుమతిగా ఇస్తున్నానని సందీప్ తన పోస్ట్‌లో తెలిపాడు. ఇలాంటి లక్ష్యాలు ఎనలేని సంతోషాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories