పవన్ ను విమర్శించి.. రోజా అభాసుపాలు!

ప్రజలు దారుణంగా ఓడించేశారు. ఇప్పుడేం పనిలేదు. ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లుతూ కాలం గడపాలి. అంతకు మించి వేరే దారిలేదు. అందుకే రోజా ట్విటర్ లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు. ప్రెస్ మీట్ పెట్టడం కూడా డబ్బు వృథా అనుకుంటున్నట్టుగా ఉన్నారు.  కానీ ట్వీట్లు మాత్రం జోరుగానే పెడుతుంటారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానాలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తప్పిపోయిన ఆడవాళ్ల గురించి పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. అక్కడ ఏం చర్చ జరిగిందో తెలియదు.. మంత్రి ఏం జవాబు ఇచ్చిందో తెలియదు.. కానీ ఒక డాక్యుమెంట్ దొరికేసరికి దాన్ని పట్టుకుని.. ఏదో ఆధారాలు దొరికినట్టుగా ట్వీటు చేసి పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి ఆమె పూనుకున్నారు. పవన్ ఆత్మవిమర్శ చేసుకో.. ఇదీ అసలు నిజం అంటూ ఆమె రెచ్చిపోయారు.

ఆమె ట్వీట్ ఇళా సాగింది.
‘‘అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు  తెలుగుదేశం, జనసేన చేసిన తప్పుడు ప్రచారం  బట్టబయలైంది.
గత  YSRCParty  ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం.

ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి నమోదయ్యాయి అని సాక్షాత్తు హోంమంత్రి అనిత  నే అసెంబ్లీ లో ప్రశ్నకి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చారు.
గతంలోనే మిస్సింగ్ కేసులలో 99.5 శాతంకి పైగా  మహిళలను గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్ లో స్పష్టం చేసింది. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి పవన్ కల్యాణ్ అధికారం కోసం ఎంతటి అబద్ధమైన చెప్తారా..?’’

అని పోస్టు చేశారు. దానికి సపోర్టింగ్ గా ఒక అసెంబ్లీ డాక్యుమెంట్ ఇమేజ్ కూడా పెట్టారు. కానీ అందులో ఉన్న సంగతులు వేరు. ఆమె చెబుతున్న సంగతులు వేరు. అందులో ఉన్న ఒక వాక్యాన్ని పట్టుకుని.. జగన్ సర్కారు అయిదేళ్లు పాలన కాలంలో కేవలం 34 కేసులు నమోదైనట్లుగా రోజా చెబుతున్నారు. ఈ మాటలు గమనిస్తే.. రోజా అసలు చదువుకున్న నాయకురాలేనా? లేదా చదువుల్లో కూడా ఏదైనా మతలబులు చేసి డిగ్రీలు తెచ్చుకున్నదా అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.

ఆమె షేర్ చేసిన అసెంబ్లీ డాక్యుమెంట్ లోనే.. జగన్ పాలన అయిదేళ్లు కాలంలో రాష్ట్రంలో 54122 మంది ఆడవాళ్లు (బాలికల సహా) మిస్ అయినట్టు బాక్స్ కట్టి మరీ పేర్కొన్నారు. అందులో 16366 మంది 18ఏళ్లకంటె తక్కువ వయసున్న బాలికలు అని చెప్పారు. 46 మంది మహిళలను విమెన్ ట్రాఫికింగ్ లో గుర్తించారు.. దానికి సంబంధించి నమోదైన కేసులు 34 అని పేర్కొన్నారు. అంటే వ్యభిచార గృహాలకు తరలించినట్టుగా 34 కేసుల్లో 46 మందిని గుర్తించారు. 54 వేల మందిలో మిగిలిన వారి ఆచూకీ కూడా తెలియదని దాని అర్థం. కానీ.. రోజాకు ఇంగ్లిషులో చదివి అర్థం చేైసుకోవడం కూడా చేతకాలేదో.. లేదా, ఆమె ట్విటర్ ఖాతాలో ఆమె తరఫున పోస్టులు పెట్టే కూలీలకు ఇంగ్లీషు అర్థం కాలేదో తెలియదు. ఆ డాక్యుమెంట్ ను ఒప్పుకోవడం అంటే.. జగన్ పాలనలో 54వేల మంది ఆడవాళ్లు, బాలికలు మిస్ అయినట్టు రోజా ఒప్పుకోవడమే. మొత్తానికి ఈ ట్వీట్ ద్వారా రోజా అభాసుపాలయ్యారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories