అందరి నోళ్లూ భార్గవ పేరే పలుకుతున్నాయ్!

ఒక్క కేసులో తన పేరు బయటకు వచ్చినందుకు, తన పేరును కూడా కేసులో చేర్చినందుకు సజ్జల భార్గవ రెడ్డి కంగారుపడి ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. కానీ.. చూడబోతే.. సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల దుర్మార్గాల వ్యవహారంలో సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పటికే పీకలదాకా కూరుకుపోయినట్టుగా కనిపిస్తోంది. సోషల్ మీడియా అసభ్యకర పోస్టులతో అరెస్టు అయిన అనేక మంది.. విచారణలో సజ్జల భార్గవ రెడ్డి పేరే చెబుతున్నారు. ‘అన్ని మార్గాలూ రోమ్ నగరానికే చేరుకుంటాయ్’ అనే ఇంగ్లిషు సామెత లాగా.. ఇప్పుడు అరెస్టు అవుతున్న అందరి నోర్లూ సజ్జల భార్గవ రెడ్డి పేరునే ఉచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఆయన మీద లుకౌట్ నోటీసు కూడా జారీ అయి ఉన్న నేపథ్యంలో భార్గవ్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.  
వైసీపీ వారి అసభ్య పోస్టుల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక అరెస్టులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గుడివాడ ముబారక్ సెంటర్ కు చెందిన వైసీపీ కార్యకర్రత మహ్మద్ ఖాజాబాబా.. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఒక కేసు నమోదు అయింది. పోలీసులు ఖాజాబాబాను అరెస్టు చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి గా గతంలో ఉన్న సజ్జల భార్గవ రెడ్డి ఆదేశాలతోనే ఆ పోస్టులు పెట్టినట్టుగా ఖాజాబాబా పోలీసు విచారణలో చెప్పాడు. భార్గవరెడ్డి తదితరులపై కూడా కేసు నమోదు అయింది.

ఈ కేసులో తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ భార్గవరెడ్డి తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పోలీసుల తరఫున ఏజీ పూర్తివివరాలు ఇవ్వడానికి సమయం కోరడంతో న్యాయమూర్తి కేసు  వాయిదా వేశారు. అయితే ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరడాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. మీకు తొందర ఉంది కాబట్టి.. ఆ తొందరను కోర్టుపై రుద్దడం ఎందుకు అంటూ న్యాయమూర్తి సజ్జల తరఫు న్యాయవాదిని ఆక్షేపించడం గమనార్హం. ఇది హడావుడిగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన వ్యవహారం కాదని, లోతుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఒక్క గుంటూరు ఖాజాబాబా విచారణలో తన పేరు చెప్పినందుకే సజ్జల భార్గవ ఉలికిపడి, హైకోర్టును  ఆశ్రయించారు. తాజాగా వర్రా రవీందర్ రెడ్డి సహా అరెస్టు అవుతున్న అనేకమంది సజ్జల భార్గవ్ పేరే చెబుతున్నారు. ముందుముందు ఆయన ఎలా తట్టుకోగలరో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories