చంద్రబాబునాయుడు సారథ్యంలో ఎన్డీయే కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడి సుమారుగా అయిదు నెలలు కావస్తోంది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అయిదేళ్ల కాల వ్యవధిలోకా ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ పోతుంది. అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఆ మాత్రం వ్యవధి కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి దళాలు కుటిల విమర్శలను ప్రారంభించే
శాయి. అప్పటికీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచి అనేక హామీలను నెరవేరుస్తూ పోతున్నారు. పెన్షను చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచే 4వేలు చేసి అందిస్తున్నారు. ఏదైతే అస్సలు సాధ్యం కాదని.. ఎన్నికల సమయంలో జగన్ ప్రజలను భయపెట్టారో అవన్నీ చంద్రబాబు చేసి చూపిస్తున్నారు. అయితే ఇంకా జరగని వాటి గురించి మాత్రం జగన్ దళాలు కొన్ని నెలలుగా నానా యాగీ చేయడం ప్రారంభించాయి.
సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ? ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ? రైతులకు సాయం ఎక్కడ? తల్లికి వందనం ఎక్కడ? అంటూ నానా మాటలతో ప్రభుత్వం మీద విరుచుకుపడడం చాలా కాలం కిందటే ప్రారంభించేశాయి. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో సమర్పించడం ద్వారా వైసీపీ నాయకులందరూ నోరు మూసుకుని కూర్చోవాల్సిన పరిస్థితిని చంద్రబాబు సర్కారు కల్పించింది.
జగన్ మోహన్ రెడ్డి ఎంత అతి చేశారంటే.. బడ్జెట్ పెడితే.. సూపర్ఛ సిక్స్ హామీలకు కేటాయింపుల గురించి చెప్పాల్సి వస్తుందని.. అవి చేయడానికి గతిలేక అసలు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు రోజులు వెళ్లదీస్తున్నారని అన్నారు. కానీ ఆయన నోటికి తాళం వేస్తూ బడ్జెట్ కూడా పెట్టబడింది. అందులో హామీల గురించి కూడా చెప్పడం జరిగింది.
త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తల్లికి వందనం గురించి కూడా నిధులు కేటాయించారు. దశలవారీగా ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా బకాయిలు విడుదల చేయడం జరుగుతుందని ప్రకటించారు. జగన్ సర్కారు పెట్టిన ఫీజు బకాయిలు అన్నిటినీ కూడా చంద్రసర్కారు చెల్లించనుంది.
ఇప్పుడు ఏ అంశాల గురించి కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం లేదని.. వైసీపీ నాయకులు కుమిలిపోతున్నారు. చంద్రసర్కారు అందరి నోర్లు మూయిస్తోందని అనుకుంటున్నారు.