కుప్పం మునిసిపాలిటీని తాము దక్కించుకున్నాం అని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏ రేంజిలో విర్రవీగారో చెప్పలేం. కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించారు. నిజానికి కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో అనేక అరాచకాలు సృష్టించి బెదిరించి, ప్రలోభపెట్టి, నామినేషన్లు వేయకుండా పోలీసులను ప్రయోగించి మొత్తానికి గెలిచారు. కానీ ఇప్పుడు ఏమైంది..? కుప్పం మునిసిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఇప్పుడు వైసీపీకొ గుడ్ బై కొట్టారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మునిసిపల్ చైర్మన్ పదవికి, కౌన్సిలరు పదవికి కూడా రాజీనామా చేసి తెదేపాలోకి చేరిపోయారు. ఇది కుప్పం గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి అహంకారానికి గొడ్డలివేటులాగా పలువురు భావిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత.. అనేక రకాలుగా అరాచకత్వానికి తెరతీశారు. ప్రత్యేకించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నెన్ని ఘోరాలకు పాల్పడ్డారో లెక్కే లేదు. పంచాయతీల్లో తెలుగుదేశం, జనసేన తరఫున నామినేషన్ వేయదలచుకున్న వారిని కిడ్నాపులు చేశారు. బెదిరించారు. నామినేషన్ వేసిన వారికి వైసీపీ కండువాలు కప్పేసి వారి పార్టీ కింద క్లెయిం చేసుకున్నారు. ఇలాంటి అరాచకాలు అనేకం చేశారు. వాటిలో భాగంగానే కుప్పం మునిసిపాలిటీ కూడా వైసీపీకి దక్కింది.
కుప్పంలో వైసీపీ అరాచకత్వం ఒక ప్రత్యేక అధ్యాయం. అది చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కావడంతో.. జగన్ దళాలు రెచ్చిపోయాయి. తెలుగుదేశం వారిని బలవంతంగా పార్టీ మార్పించాయి. రకరకాల దౌర్జన్యాలు చేశారు. ఎట్టకేలకు మునిసిపాలిటీ వారి చేజిక్కింది. చంద్రబాబు కోట బీటలు వారుతోందని, ఆ కోటలో తాము పాగా వేశామని రకరకాలుగా ప్రచారం చేసుకున్నారు. హేళన చేశారు. చంద్రబాబును కించపరిచారు.
తీరా ఇప్పుడు ఏమైంది? వైసీపీలో నిన్నటిదాకా ఉన్న మునిసిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కౌన్సిలర్ పదవిని కూడా వదులుకుని, వైసీపీకి గుడ్ బై కొట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనితో జగన్మోహన్ రె డ్డి అహంకారానికి గొడ్డలిదెబ్బ తగిలినట్టుగా అయింది.