గత కొద్ది రోజులుగా ఏపీ హాట్ టాపిక్ వైఎస్ ఫ్యామిలీ మేటర్. అన్నా చెల్లెళ్ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. రాజకీయ కక్ష నుంచి ఆస్తి పంపకాల వివాదం వరకు నిత్యం ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ మీద షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
తనకు ప్రాణ హాని ఉందని షర్మిల అన్నారు. అన్నతో ఆస్తి వివాదం తీవ్రస్థాయికి చేరడంతో మరింత భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని షర్మిల అడిగారు. 4+4 సెక్యూరిటీతో పాటు వై- క్యాటగిరి భద్రత ఏర్పాటు చేయాలని షర్మిల చంద్ర బాబు ప్రభుత్వాన్ని కోరారు. షర్మిలకు ప్రస్తుతం 2+2 భద్రత ఉంది. 100శాతం ఆస్తులు తన పేరు మీద బదిలీ చేస్తానని.. MOUపై సంతకం చేసినపుడు బెయిల్ రద్దవుతుందని జగన్ కి తెలియదా? అని షర్మిల ప్రశ్నించారు. షేర్ల ట్రాన్స్‌ఫర్లకు, బెయిల్‌కు సంబంధం లేదని..అన్ని తెలుసు కాబట్టే చేయాల్సినవి అన్ని చేశారని మండిపడ్డారు.
గత కొద్ది రోజులుగా జగన్ షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదంపై వై.ఎస్.సతీమణి విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ బహిరంగ లేఖను రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు తనను చాలా బాధిస్తున్నాయి అని ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను జరుగుతున్న పరిణామాల్ని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయని అన్నారు.