మన టాలీవుడ్ లో ప్రెజెంట్ షైనింగ్ యువ నటుల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఓ నటుడు. రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న తాను పలు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇలా గ్యాప్ తీసుకొనే సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్న సినిమా “క”. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం హైలైట్ గా మారాయి. కిరణ్ చేసిన వర్క్ గురించి నేను తెలుసుకున్నాను. కిరణ్ లాంటి వారు అంటే నాకు ఎంతో గౌరవం, ట్రైలర్ చూసిన వెంటనే ఎంతో నచ్చింది.
తర్వాత కిరణ్ కాల్ చేసి అన్నా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా అని అడిగితే నాకు ఎంతో గర్వంగా అనిపించింది అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. అలాగే నేను ఒక బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చాను, కిరణ్ చూసిన కష్టాలు లాంటివి నాకు తెలియదు, కిరణ్ వర్క్ కి నేను నెంబర్ 1 ఫ్యాన్ అంటూ చేసిన కొన్ని నిస్వార్ధపూరిత కామెంట్స్ అయితే చైతూని డెఫినెట్ గా మరో మెట్టు ఎక్కించాయని చెప్పాలి. ఈ కామెంట్స్ తో అయితే కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు.