కేటీఆర్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు : ఏం సాధించారు?

తెలంగాణ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు పోలీసుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని.. భారాస నాయకుల్లో ఎవరో ఆదివారం నాడు ఆరోపించారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు పోలీసులు. బొద్దింకలు పేడపురుగులు మాత్రమే దొరికాయి. ఇలా బొద్దింకలు గట్రా ఉండడం.. పలానా పలానా సెక్షన్ల కింద నేరం అని ప్రకటించేసి.. ఆ మేరకు కేసులు నమోదు చేసేశారు. కానీ.. ఈ ఎపిసోడ్ ద్వారా ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావును డ్రగ్స్ ఉచ్చులో ఇరికించడానికి.. ఏ చిన్న ఆధారం దొరికినా సరే బిగించేయాలని తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

కేటీఆర్ బావమరిది రాజ్  పాకాల కు చెందిన ఫాం హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారని తెలిసి ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడిచేశారు. అక్కడ ఉన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 12 మంది పురుషులకు డ్రగ్ టెస్టులు చేయిస్తే కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా తేలిన విజయ్ మద్దూరి.. తనకు కొకైన్ ను రాజ్ పాకాల ఇచ్చినట్టుగా చెప్పారని పోలీసులు అంటున్నారు. అంతకు మించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అక్కడితో ఆగకుండా.. రాజ్ పాకాల నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ మీద కూడా పోలీసులు దాడి చేశారు. ఆయన విల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. తలుపులు పగలగొట్టి మరీ లోనికి వెళ్లి సోదాలు నిర్వహించారు. విదేశీ మద్యం సీసాలు మినహా వారు కనుగొన్నది ఏమీ లేదు. డ్రగ్స్ దొరకనేలేదు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డీజీపీకి ఫోను చేసి.. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తారని నిలదీస్తున్నప్పటికీ వారు పట్టించుకోలేదు. ఎన్ని సోదాలు చేసిన లిక్కర్ సీసాలు మాత్రమే దొరికాయి.

అయితే అసలు అది ఫాం హౌస్ కానే కాదని, ఆయన నివాసం ఉంటున్న ఇల్లు అని.. దీపావళి సందర్భంగా ఇంట్లో తన బంధువులను పిలిచి పార్టీ చేసుకుంటున్నారని, అలా పార్టీ చేసుకోవడం కూడా తప్పేనా అని కేటీఆర్ అడుగుతున్నారు. రాజ్ పాకాల విల్లాల వద్ద సోదాలకు వచ్చిన పోలీసుల్ని అడ్డుకున్న భారాస నాయకుల్ని అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఇలా చాలా సుదీర్ఘమైన ఎపిసోడ్ నడిచింది. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులే నవ్వులపాలు అయ్యారు. కేవలం లిక్కర్ సీసాలు పట్టుకోవడానికి ఇంత హడావుడి అవసరమా అని జనం నవ్వుకుంటున్నారు. కానీ డ్రగ్స్ విషయంలో కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఈ పార్టీ తనిఖీలు, సోదాల్లో ఏమైనా దొరికి ఉంటే ఆయనను బుక్ చేయడానికి ప్రయత్నించారని అంతా అనుకుంటున్నారు. భారాస నాయకులు మరింత అలర్ట్ గా ఉ:డాలని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories