జగన్ ఓవరాక్షన్ : సరస్వతి కంపెనీకే ఎసరు?!!

తల్లికి రాసిఇచ్చిన షేర్లను వెనక్కు తీసుకోవడానికి.. ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం ద్వారా.. తన గొయ్యి తానే తవ్వుకున్నారా? ఈ వ్యవహారం ఆయన రాజకీయ భవిష్యత్తుకు చేస్తున్న చేటు సంగతి అటుంచితే.. అటు సరస్వతి పవర్ కంపెనీని కూడా ముంచేయనున్నదా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. సరస్వతీ పవర్ అనే సంస్థను అడ్డుపెట్టుకుని ఎన్నిరకాల దందాలకు, వక్రమార్గాలకు పాల్పడ్డారో అవన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతోంది.

సరస్వతీ పవర్ సంస్థకు జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీ దాదాపుగా 1500 ఎకరాల పైచిలుకు భూములను కొనుగోలు చేసింది. అయితే వారి ఆధీనంలో ఉన్న మొత్తం భూముల్లో ఇంకా కొంత మేర ప్రభుత్వ భూములు, కొండలు, వాగులు, వంకలు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిపై క్షుణ్నంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ భూములు ఏమైనా ఉన్నాయేమో అనే దిశగా అధికార్లతో సర్వే నిర్వహింపజేశారు. అయితే అటవీ భూములు లేవని ఎమ్మార్వో తేల్చిచెప్పారు. ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, కొండలు ఉన్నాయో లేదో తేలాల్సి ఉంది. అలాంటివి ఉండి వాటిని ప్రభుత్వం సరస్వతి సంస్థకు కేటాయించి ఉంటేగనుక.. ఇప్పుడు వివాదం మళ్లీ మరోదారి పడుతుంది,
ఒకవైపు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వంటి వారు.. సరస్వతి సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేయాలనే డిమాండ్ తెరమీదికి తెస్తున్నారు. వారి భూములతో పాటు, కంపెనీ నడవడానికి కేటాయించిన నీటి కేటాయింపులను కూడా రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అలాగే గనుల లీజు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయాలనే డిమాండ్ ప్రబలంగా వినిపిస్తోంది. ఈ అనుమతులన్నీ పొందడంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, తాను ముఖ్యమంత్రి అయ్యాక గానీ.. ఎన్ని రకాలుగా అడ్డదారులు తొక్కారో అంతా వెలుగులోకి వస్తోంది. ఇప్పుడున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆ అనుమతులన్నీ రద్దు చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే సరస్వతి కంపెనీ విలువ ఎందుకూ పనికి రాకుండా పోతుంది.

జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ కు వెళ్లకుండా ఉంటే.. ఈ కంపెనీ మీద ఎవ్వరి దృష్టి పడి ఉండేది కాదని.. ఆయన అనవసరంగా తన నెత్తిన తానే చెత్త వేసుకున్నారని.. అసలు కంపెనీ భవిష్యత్తునే ప్రమాదంలో పడేశారని రాజకీయ వర్గాల్లో ఒక వాదన వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories