మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా అసహ్యకరమైన రీతిలో కన్నతల్లికి గిఫ్టు కింద ఇచ్చిన కంపెనీ షేర్లను వెనక్కు తీసుకోవాలని తల్లి మీదనే కోర్టుకు వెళ్లారు. ఇలా చేసినందుకే రాష్ట్రంలోని జగన్ వీరాభిమానులు తప్ప ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే పరిస్థితి! అయితే ఇలా తల్లి మీద చెల్లి మీద కోర్టుకు వెళ్లడానికి అసలు కారణం వేరే ఉన్నదని.. ఆమె ఆ షేర్లను షర్మిలకు బదలాయిస్తే గనుక జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని.. షర్మిల- చంద్రబాబు నాయుడుతో కలిసి అలాంటి కుట్రలో భాగస్వామిగా మారి జగన్ బెయిల్ రద్దు చేయించడాన్ని.. అడ్డుకోవాలంటే పేర్లు చేతులు మారకుండా చూడడం అవసరం కాబట్టి పిటిషన్ వేసినట్లుగా ఒక కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ యొక్క సోషల్ మీడియా దళాలు ఈ నీలి దళాలకు అనుకూలంగా వ్యవహరించే సమస్త మీడియా సంస్థలు ఈ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. జగన్ బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపడానికి చెల్లెలు కుట్ర చేస్తుంది కనుక దానిని ఎదుర్కోవడానికి ఆస్తులు కోసం పిటిషన్ వేయడం తప్ప జగన్ కు వేరే గత్యంతరం లేదు అన్నట్టుగా అందరూ ఒక రంగు పులిమేరు. ఇదంతా అబద్ధం అని తేట తెల్లం అయ్యేలాగా షర్మిల సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
తల్లి మీద పిటిషన్ వేయడమే కాకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజిలో విమర్శించారు షర్మిల. ఆ మాటకొస్తే.. 2016లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ- సరస్వతీ పవర్ సంస్థకు చెందిన ఆస్తులను మాత్రమే అటాచ్ చేసిందని, పేర్లను అటాచ్ చేయలేదని అసలు వాస్తవాన్ని బయటపెట్టారు. షర్మిల జగన్ కల్లబొల్లి మాటలు నిజమైతే గనుక 2016లో ఆస్తులు అటాచ్మెంట్ జరగగా 2019లో తల్లి పేరిట గిఫ్ట్ డీడ్ ఎలా చేశారు? నేరమైతే అప్పుడే నేరమయ్యేది కదా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు! నిజానికి 2019 ఆగస్టులో తనకు వివిధ కంపెనీలలో వాటాలు కేటాయిస్తూ ఇచ్చిన ఎంఓయూ ను కూడా ప్రస్తావిస్తున్నారు. బెయిలు రద్దయ్యే న్యాయపరమైన చిక్కు ఉన్నట్లయితే ఆ ఎంవోయూ వల్లనే వచ్చేదని, ఇప్పుడు జగన్ చెబుతున్న మాటలన్నీ శుద్ధ అబద్ధాలు అని చాటి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాయమాటల బండారం మొత్తం చెల్లెలు షర్మిల విమర్శలతో బయటపడుతుంది. ఆయన చాలా సంకుచితమైన బుద్ధితో తల్లికి ఇచ్చిన షేర్లను వెనక్కు తీసుకోవడానికి కోర్టులో దావా నడుపుతున్ష్నారని ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతోంది.