వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్, షర్మిల ఆస్తి వివాదం గురించి చంద్రబాబు మాట్లాడుతూ… తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నాడని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయలంటే సిగ్గుగా ఉందన్నారు.
2004లో వందల కోట్లుగా ఉన్న సంపాదన 2024లో లక్షల కోట్లకు ఎలా చేరుకుందని.. బాబు ప్రశ్నించారు. కనీస విలువలు పాటించని ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేయాలంటే తనకు సిగ్గుగా ఉందని చంద్రబాబు అన్నారు.
తల్లి, చెల్లిని ఆస్తి కోసం కోర్టుకీడ్చిన జగన్.. ఇకనైనా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. “విలువలు లేని మనుషులు సమాజానికి చేటు. ప్రభుత్వంలో ఉండగా పేదలకు ఎప్పుడైనా సాయం చేశారా. ఇప్పుడేమో వైసీపీ తరఫున రూ.10 లక్షలు ఇస్తామంటున్నారు. జగన్ దగ్గర ఉన్న అవినీతి సొమ్ము అలాగైనా పేదలకు చేరుతుంది. ప్రతిపక్షంలో ఉండగా.. నన్ను 5 ఏళ్లపాటు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ఇప్పుడు వారిని ఆపాలంటే నిమిషం కాదు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీద కుదరదు” అని బాబు స్పష్టం చేశారు.