సజ్జల కదా.. ఆయనను వెతకడం కూడా తప్పే!

సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏపీ పోలీస్ అధికారుల మీద కోర్టులో పిటిషన్ వేశారు. వారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ అందులో ఆరోపించారు. విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి సజ్జల కూడా ఒక నిందితుడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఆయన ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు ఆమోదించలేదు. కాకపోతే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సజ్జల విషయంలో కఠిన చర్యలు తీసుకోవద్దు అనే ఉపశమనపు ఉత్తర్వులు మాత్రం ఇచ్చింది. అంటే మళ్ళీ కోర్టు చెప్పే వరకు అరెస్టు చేయవద్దు అనేది మాత్రమే కోర్టు ఉద్దేశం. సజ్జల గారు సదరు కోర్టు తీర్పును తనకు నచ్చినట్టుగా అన్వయించుకుంటున్నారు. తన మీద పోలీస్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం కూడా కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మళ్లీ కోర్టుకు వెళ్లారు.l

సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన రోజున కడప జిల్లా బద్వేలులో ఒక కార్యక్రమంలో ఉంటూనే దాడికి సంబంధించి పూర్తి ప్రణాళికను పక్కాగా అమలు చేశారనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఫోన్ల మీదనే నాయకులను పురమాయించి వారి ద్వారా అనుచరులను, కిరాయి మనుషులను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయించడానికి ఆయన మూల కారకులుగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు నిందితుల జాబితాలోకి రాగానే ఆయన ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవడం కఠిన చర్యలు వద్దన్నట్టుగా ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ తరువాత పోలీసులకు కనీస సమాచారం లేకుండా ఆయన తనంతట తాను విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత మాత్రమే లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. సజ్జల అటు హైదరాబాదు, ఇటు విజయవాడ కాకుండా ముంబై ఎయిర్పోర్టుకు తిరిగివచ్చారు. కేవలం లుకౌట్ నోటీసు ఉండడం వల్ల మాత్రమే సజ్జల తిరిగి ఇండియాకు వచ్చినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. లేకపోతే ఇండియా రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ఉండేవారని, ఆ వ్యూహం దెబ్బతిన్నందుకు ఆయనకు పోలీసుల మీద కోపం వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది కనుక వారు ఎలాంటి చర్య తీసుకోకుండా ఆయనను విడిచి పెట్టాల్సిందిగా ముంబాయి ఎయిర్పోర్ట్ పోలీసులకు చెప్పారు.

అసలు తన మీద లుకోట్ నోటీసు జారీ చేయడమే తప్పు- అదే కఠిన చర్య అన్నట్టుగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం విశేషం. లుక్ అవుట్ నోటీసు కూడా కఠిన చర్య కిందికి వస్తుంది అని ఎంతో మేధావి అయిన, రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్లపాటు కీలక సలహాదారుగా పనిచేసిన వ్యక్తి అనుమానించడం చిత్రంగా ఉంది. పోలీసు అధికారులు తన మీద లుకౌట్ నోటీసు జారీ చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులు దిక్కరించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే లుకౌట్ నోటీసు కూడా కఠిన చర్యలు కిందికి వస్తుందా రాదా తాను వ్యాఖ్యానించలేనని ఒక బెంచి న్యాయమూర్తి పేర్కొన్న నేపథ్యంలో.. గతంలో బెయిల్ పిటిషన్ వ్యవహారం చూసిన న్యాయమూర్తి బెంచ్ కే ఈ పిటిషన్ కూడా వెళ్లేలా ఆదేశాలు రావడం గమనార్హం.

Related Posts

Comments

spot_img

Recent Stories