చరణ్‌ గురించి ప్రొడ్యూసర్‌ కీలక వ్యాఖ్యలు!

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్, బాబీ, బాలకృష్ణ మూవీ,  సందీప్ కిషన్ మజాకా ఇప్పటివరకు విడుదలకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి పండక్కి వస్తున్నాం, రవితేజ 75 పొంగల్ రేస్ నుండి తాజాగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చెప్పడం తప్పైనట్టుంది.

ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తమకు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు. తాజగా సితార బ్యానర్ లో వస్తోన్న ‘లక్కీ భాస్కర్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ గేమ్ ఛేంజర్ పై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా ఎలా తయారైందో ఆయన వివరించారు. ఆయన మాట్లాడుతూ ” సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తున్నాయి, కంపిటేషన్ ఉంటుంది కదా అని జర్నలిస్ట్ అడిగిన దానికి, నాకు తెలిసి ఈ సారి ఆరు సినిమాలు రావు సో పెద్ద పోటీ ఉండదు అనే భావం వచ్చేలా చెప్పాను.

దాన్ని సోషల్ మీడియాలో రామ్ చరణ్ గామే వస్తుంది కానీ ఆడియో పెద్ద పోటీ కాదంట అని నాగవంశీ అన్నాడు అని ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. నేను కేవలం సంక్రాంతికి వచ్చే సినిమాల పైన చెప్పిన విషయాన్ని మార్చి రామ్ చరణ్ గురించి ఫాన్స్ వార్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు. ఏ హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ వేరే సినిమా గురించి ఎప్పడూ తక్కువుగా అనుకోడు. అందరి హీరోలతో సినిమా చేయాలని ప్రతి నిర్మాత కోరుకుంటాడు” అని వివరించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories