మొదలైన చైతూ-శోభిత పెళ్లి పనులు!

అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. నటి శోభితా ధూళిపాళ్ల తో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించి  శోభిత కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శోభిత ఈ ఫోటోలను పంచుకుంటూ గోధుమ రాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలైనట్లు వివరించింది. వైజాగ్ లోని శోభిత స్వగృహంలో కార్యక్రమం జరిగింది. వీరి పెళ్లి డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి జరగనుందని సమాచారం. అయితే తేదీ మాత్రం ఖరారు కాలేదు. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య – శోభితలు ప్రేమలో ఉన్నారు.

వీరిద్దరూ కలిసి తిరిగిన కొన్ని ఫోటోలు ఇదివరకు బయటకు రావడంతో.. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, సోషల్ మీడియాలో వార్తలు తెగ షికారు చేశాయి. మొత్తానికి వీటిని నిజమని నిరూపిస్తూ.. ఆగస్టు 8న నాగచైతన్య – శోభితల నిశ్చితార్థం జరిగింది. ఆ కార్యక్రమం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుక సంబంధించి ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories