నానికి అది ఒక్క నిమిషమే ఉంటుందంట!

ప్రతి మనిసికి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైన ఫీలింగ్‌ కోపం. కొంతమంది కోపం వస్తే అణుచుకోగలుగుతారు. కొంతమంది మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేక చేతికి ఏది దొరికితే దానిని పగలగొడుతుంటారు.  కోపం వస్తే కొంతమంది మాత్రం పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. మ‌రికొంత మందిలో ఆ కోపం వెంట‌నే తగ్గిపోతుంది. దీనినే ముక్కు మీద కోపం..మూతి మీద కోపం అంటుంటారు. మ‌రి నేచుర‌ల్ స్టార్ నాని కోపం ఎలాంటింది అంటే? రెండో రకం అని చెబుతుంటారు.

ఈ విష‌యాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నానికి కోపం వ‌చ్చినా ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నెక్ట్స్ మినిటే ఆ కోపం క‌రిగి పోతుందంట‌. ఇలా క‌రిగి పోవ‌డమే త‌న‌ బ‌ల‌హీన‌త‌గా చెప్పుకొచ్చాడు. ఎవ‌రైనా ఏదైనా అన్న ఆ క్షణం కోపం వచ్చినా ? వెంట‌నే చల్లారిపోతుందంట. అంతేకానీ వాళ్లేదో అనేశారని…వాళ్ల మీద పగ పెంచేసుకుని..ప్రతీకారం తీర్చుకోవ‌డం.. అంతేకాకుండా ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేయడం.

ఇలా కోపం చ‌ల్లారిపోవ‌డం అన్నది కొంత మందిలో గొప్ప ల‌క్షణంగా చెప్పుకొవచ్చు. ప‌గ‌లు..ప్రతీకారాల‌తో సాధించేది ఏమీ ఉండ‌దు. అన‌వ‌స‌ర‌మైన వివాదాల్లో చిక్కుకోవ‌డం త‌ప్పు. నాని మనస్తత్వం కూడా అలాంటిదేనట. వెరీ కామ్ గోయింగ్ ప‌ర్సన్. ఎలాంటి వివాదాల్లో వేలు పెట్టడు. త‌న ప‌ని తాను చూసుకుని వెళ్లిపోతాడు. ఇత‌రుల విష‌యాల జోలికి వెళ్లనే వెళ్లడు.

చాలా జోవియ‌ల్ గా ఉంటాడు. న‌వ్వితే న‌వ్వుతాడు. ప‌ల‌క‌రిస్తే హాయ్ అంటాడు. ఇంత‌కు మించి ఎదుట వారు ఆశించేది ఏముంటుంది? అందుకే స్టార్ హీరోగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో వ‌రుస విజయాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories