“రోలెక్స్” కి సూర్య సినిమాకి ఉన్న లింకేంంటే!

కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఫిల్మోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్‌ తో కూడిన సినిమాలు సూర్య ఇప్పుడు వరకు చేస్తూ వచ్చి తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” తో తాను వస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సూర్య చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్  ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరి ఈ కామెంట్స్ లో భాగంగా తన నుంచి రానున్న క్రేజీ ప్రాజెక్ట్ “రోలెక్స్” పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  రోలెక్స్ సినిమాకి ఇది వరకే తాను చేసిన మరో సినిమాకి కనెక్షన్ ఉంది అని సూర్య తాజాగా చెప్పుకొచ్చారు. అయితే తనది మరో సినిమా అంటే కచ్చితంగా “విక్రమ్” అయితే కాదు.

మరి ఆ సినిమా ఏంటి…దానికి రోలెక్స్ తో ఎలా సంబంధం కుదిరింది అనేది మాత్రం లోకేష్ కనగరాజ్ సూర్యకే తెలియాలి. మరి సూర్య చేసిన గత చిత్రాల్లో డ్రగ్స్ రిలేటెడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. మరి వాటితో ఏమన్నా కనెక్షన్ ఉందా అనేది మాత్రం థియేటర్లలలో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories