రెండు రోజుల ముందుగానే పొట్టేలు ప్రీమియర్‌ షోలు!

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల  ప్రధాన తారాగణంగా  చేస్తున్న చిత్రం ‘పొట్టేల్‌’. సాహిత్‌ మోత్కూరి దర్శకుడు. నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగె ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించింది.

 మైత్రి మూవీ మేకర్స్ నైజాం రైట్స్ కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను పలువురికి చూపించారని చూసి బావుందని చెప్పిన ఒక స్టార్ డైరెక్టర్ ఇచ్చిన నమ్మకంతో అలాగే కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజులు ముందుగానే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు మైత్రీ నిర్మాతలు.

అయితే పొట్టేల్ సినిమాలో అజయ్ రోల్ చాలా సర్ప్రైజింగ్ ఉంటుందని సమాచారం. అజయ్ కెరియర్ లోనే ది బెస్ట్ రోల్ అంటున్నారు చూసిన వాళ్ళు. నేడు ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మలయాళ నటి సంయుక్త మీనన్ ఆథిదిగా నేడు AAA సినిమాలో విడుదల చేయబోతున్నారు. మరోవైపు విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర బృందం.

తాజాగా విమానంలో పొట్టేల్ పాంప్లేట్లు పంచుతూ హీరోయిన్ అనన్య నాగళ్ల, హీరో కృష్ణ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories