హిట్‌ కాంబో నాలుగోసారి!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్‌ కాంబో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్‌, అఖండ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి సూపర్‌ కలెక్షన్లు రాబట్టాయి. లాక్‌డౌన్ సమయంలో  విడుదలైన  అఖండ  సినిమా బాలయ్య బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది.

అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా ఈ సినిమా గురించి అనౌన్స్ చేశారు. అఖండకు సీక్వెల్‌గా ‘అఖండ 2 – తాండవం’ తెరకెక్కనుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ ఈరోజు విడుదల చేసింది. అఖండ 2 అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ పెట్టారు. తొలి భాగం ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుంది.

 అఖండ పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది ఇందులో చూపించనున్నారు.  బుధవారం పూజా కార్యక్రమంతో అఖండ 2ను లాంచ్ చేయనున్నారు. స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు బాలయ్య బాబు వరుస హిట్స్ కొడుతుండడంతో అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాబీ మూవీతో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ తర్వాతే అఖండ 2 షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు.

Related Posts

Comments

spot_img

Recent Stories