వాళ్లు చెప్పినదంతా సజ్జల కంఠతా పట్టాల్సిందే!

చైనీస్ లో ఒకసామెత ఉంటుంది. దాని యొక్క తెలుగు అర్థం ఏంటంటే.. ‘నిజం చెప్పడంలో ఉండే లాభం ఏంటంటే.. మేనం ఏం చెప్పామో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు’ అని!

నిజమే కదా.. నిజం చెప్పేవాళ్లు ఎన్ని వందల సార్లు అడిగినా, ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగినా కూడా ఆ నిజాన్నే చెబుతారు. అదే అబద్ధం చెబితే పరిస్థితి అలా కాదు. ఒకసారి అబద్ధం చెప్పిన తర్వాత.. దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఎన్నిసార్లు అడిగినా అచ్చంగా అదే అబద్ధాన్ని పొల్లుపోకుండా చెప్పాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగినా కూడా సేమ్ టూ సేమ్ చెప్పేలాగా గుర్తు పెట్టుకోవాలి. ఈ పాయింట్ ను బేస్ చేసుకుని తీసిన సినిమానే ‘దృశ్యం’! ఒక అబద్ధాన్ని తయారు చేసి.. ఫ్యామిలీ మొత్తం చాలా పక్కగా అదే అబద్ధాన్ని బలంగా గుర్తు పెట్టుకోవడం వలన కేసు నుంచి బయటపడతారు. అందరూ ఒకటే అబద్ధాన్ని చెప్పడం అనేది వారి సేఫ్ గేమ్ అన్నమాట.

ఇప్పుడు అలాంటి పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎదురైంది. 2021 అక్టోబరు 19వ తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన గూండాలు, నాయకులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. వారిని వెనుకనుంచి కొందరు నాయకులు ప్రేరేపించి, రెచ్చగొట్టి పంపించారు. ఈ దాడులకు సూత్రధారి కూడా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు సంగతి తేల్చడానికి పోలీసులు నడుం బిగించారు. తమ అనుచరులను, పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడికి పురిగొల్పి పంపారనే ఆరోపణల మీద దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను పోలీసులు విచారించారు. వారు విచారణకు సహకరించలేదని అనేక వార్తలు వచ్చాయి. వారు నిజం చెబుతారనే నమ్మకం ఎవ్వరికీ లేదు. వాళ్లు అన్నీ డొంక తిరుగుడు జవాబులే చెప్పారని అంతా అంటున్నారు.

ఇప్పుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి వంతు వచ్చింది. ఈ దాడులకు పురిగొల్పిన అసలు సూత్రధారిగా సజ్జల కూడా కేసులో నిందితుడు అయ్యారు. ఇన్నాళ్లు విదేశాల్లో గడిపిన సజ్జల ముంబాయి ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే.. అప్పటికే ఆయన మీద లుక్ అవుట్ నోటీసు జారీ అయి ఉండడం వలన అక్కడి ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్బంధించారు. అప్పటికి ఆయనను అరెస్టు చేసే అవసరం లేదని ఏపీ పోలీసు క్లియర్ చేసిన తర్వాత మాత్రమే సజ్జల బయటకు వచ్చారు. అయితే ఆయనకు గురువారం నాడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చాు.

పాపం సజ్జలకు పెద్ద కష్టమే వచ్చింది. ఇన్ని రోజులుగా విచారణఖు హాజరైన వ్యక్తులు, అలాగే లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, అవినాష్ ఏం చెప్పారో ఆయన పక్కగా అడిగి తెలుసుకోవాలి. వాళ్లు చెప్పిన అబద్ధాలు అన్నింటినీ జాగ్రత్తగా కంఠతా పెట్టాలి.  వారు చెప్పిన అబద్ధాలతో సజ్జల ఇచ్చే వివరణలు తేడా కొట్టాయంటే గనుక.. అందరూ ఇరుక్కుంటారు. జగన్ ఏలుబడిలో సకల శాఖల మంత్రిగా.. ప్రత్యేకించి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని చెలరేగిన సజ్జల రామక్రిష్ణారెడ్డి పోలీసువిచారణకు హాజరుకావాల్సి రావడమే విశేషం. ఇతరులు చెప్పిన అబద్ధాలన్నింటినీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సి రావడం.. ఆయనకు ఎదురైన ఇంకా పెద్ద కష్టం!!

Related Posts

Comments

spot_img

Recent Stories