బాలయ్య అభిమానులు ఊపిరిపీల్చుకోండి ఇక!

నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అఖండ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది.  కరోనా సమయంలో ప్రేక్షకులను ట్రాక్టర్ల మీద కూడా థియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

ఇక ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ బోయపాటి కాంబో లో నాలుగో సినిమాకి సంబంధించిన ముహూర్తం రేపు ఉదయం 10 గంటలకు ఉంది. విజయదశమి సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్.14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

ఈ సినిమా అఖండ 2 అనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటి వరకు సినిమా యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ దాదాపుగా ఇది అఖండ 2 అనే ప్రచారం అయితే ఉంది. రేపు చిన్నపాటి టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏ విషయం రేపు ఉదయానికి క్లారిటీ వచ్చేది అవకాశం అయితే కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories