జగన్ మరో ద్రోహాన్ని దిద్దుతున్న చంద్రబాబు!

ఒక్కచాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా నడిపిస్తూ అనేకానేక ద్రోహాలు చేశారు.అలాంటి ద్రోహాలను కొత్త ప్రభుత్వం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక్కటొక్కటిగా చక్కదిద్దుతున్నారు. జగన్ పాలన  కాలపు లోపాలను సరిచేస్తున్నారు. ఇసుక, లిక్కర్ వ్యాపారాల రూపంలో జగన్ సర్కారు రాష్ట్రం యొక్క సహజవనరులను ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నదో, పేదప్రజల జేబులను ఎన్ని వేల కోట్లరూపాయలు కొల్లగొట్టినదో అందరికీ తెలుసు. ఆ రెండు విభాగాల్లో కొత్త  విధానాలను తీసుకురావడం ద్వారా చంద్రబాబునాయుడు పరిస్థితులను సెట్ చేశారు. జగన్ అయిదేళ్లు పాలన కాలం యువతకు శాపగ్రస్థ పీరియడ్ లాగా నడిచింది. ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి కొత్తగా రాలేదు. ఉన్నవాటిని జగన్ వెళ్లగొట్టారు. కొత్తగా రాదలచుకున్న వాటిని భయపెట్టి ఆపేశారు. అలాంటిది.. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఆ విషయంలో దృష్టి సారిస్తున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో పారిశ్రామిక పురోగతి పరంగా రాష్ట్రం అనూహ్యమైన ప్రగతి సాధించేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాననే కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చారు. వాలంటీర్లు, లిక్కర్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు లాంటివి తప్ప ఆయన ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి కూడా లేదు. తీరా తాను నియమించిన వాలంటీర్ల ఉద్యోగాలను తాను దిగిపోయే ముందు కనీసం రెన్యువల్ చేయకుండా ద్రోహం చేసి వెళ్లారు జగన్! పరిశ్రమల విషయంలో ఏదో పగబట్టినట్టుగా వ్యవహరించారు. కొత్త పరిశ్రమలను అసలు రానివ్వలేదు. ఏపీ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే వాతావరణం ఏర్పడింది.

ఇప్పుడు చంద్రబాబునాయుడు సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకువస్తున్నారు. రాబోయే అయిదేళ్ల పదవీకాలంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా సాగుతున్న్టట్టు అర్థమవుతోంది.
సాధారణంగా ప్రభుత్వాలే పూనుకుని పరిశ్రమలను ఆహ్వానిస్తున్నప్పుడు మూలధన పెట్టుబడిపై బేస్ ప్రోత్సాహకాలను ఇస్తుంటారు. వాటితో పాటు ఆ సంస్థలు కల్పించే ఉపాధి లెక్కల ప్రకారం వారికి టాపప్ (అదనపు) ప్రోత్సాహకాలు ఇచ్చేలా చంద్రబాబు కొత్త పారిశ్రామిక పాలసీ రూపొంద బోతోంది. దీనివలన మరింత ఉత్సాహంగా కొత్త సంస్థలు ఏపీలో తమ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రభుత్వం పాలసీని ప్రకటించిన వెంటనే.. తాము కమర్షియల్ ప్రొడక్షన్ లోకి వచ్చే తేదీలను ప్రకటించే తొలి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబోతున్నారు. అంటే.. త్వరితగతిన పనులు పూర్తిచేసుకుని ప్రొడక్షన్ పూర్తిచేసి, ఉద్యోగాలు కల్పించేవారికి అదనంగా కొన్ని ప్రయోజనాలు దక్కుతాయన్నమాట. ఇలాంటి విధానాల వలన.. ఈ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోగా పారిశ్రామికీకరణ పరంగా గణనీయమైన మార్పు, ఉపాధి అవకాశాల పరంగా తిరుగులేని పురోగతి కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories