బోల్డ్‌ కామెంట్స్‌!

బాలీవుడ్ బోల్డ్ ముద్దుగుమ్మ ‘మల్లికా షెరావత్’ ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హిందీతో పాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ మల్లికా షెరావత్ నటించిన సంగతి తెలిసిందే. కొన్ని స్పెషల్ పాటలతోనూ మల్లికా షెరావత్ సందడి చేసింది. అయితే, 2012లో సినిమా ఇండస్ట్రీ నుంచి మల్లికా షెరావత్ హఠాత్తుగా తప్పుకుంది.

తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ అనే సినిమాతో మళ్లీ వెండితెర పై దర్శనం ఇచ్చింది ఈ భామ. ఈ సినిమా ప్రమోషన్‌ కు సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది కూడా. కాగా తాజాగా సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్స్ గురించి మల్లికా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, మల్లికా మాట్లాడింది అంటే.. ‘ఒక సౌత్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి హాట్‌ ఐటెం సాంగ్ ఉందని, చేయాలని అడిగారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌ అనేది అర్థమవ్వాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

నేను ఓకే చెప్పాను. ఇంతకీ, నన్ను ఎలా చూపిస్తున్నారు అని అడిగితే… మీ నడుము మీద చపాతీలు వేడి చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకి నేను ఆశ్చర్యపోయి ఆ పాట వెంటనే చేయను అని చెప్పేశాను’ అని మల్లికా షెరావత్ చెప్పుకొచ్చింది. ఇంతకీ, ఆ సౌత్ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఆమె బయటకు చెప్పలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories