నువ్వు మాకు దొరికన వరం!

బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ పై టాలీవుడ్‌ ముద్దుగుమ్మ, నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రశంసలు జల్లు కురిపించారు.  అలియా యాక్టింగ్‌, కథల ఎంపిక అద్భుతంగా ఉంటుందన్నారు. జిగ్రా సినిమా చాలా బాగుందని, అలియా నటన అద్భుతంగా ఉందని రష్మిక చెప్పుకొచ్చింది. వాసన్‌ బాలా మేకింగ్ చాలా బాగుందని రష్మిక చెప్పింది. అలియా, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జిగ్రా. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు వాసన్‌ బాలా డైరెక్షన్‌ చేపట్టారు.

 జిగ్రా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా.. సినీ తారల కోసం ముంబైలో స్పెషల్‌ షో కూడా ప్రదర్శించారు. ఈ షో కు రష్మిక మందన్న కూడా హాజరయ్యారు. సినిమా చూసిన ఆమె ఇన్‌స్టా లో చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ‘జిగ్రా సినిమా చూశా. అద్భుతంగా ఉంది. ఆర్టిస్ట్స్, చిత్ర బృందాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయా.

అలియా.. నువ్వు మాకు దొరకడం ఓ వరం. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి థాంక్యూ. వేదాంగ్‌ రైనా బాగా నటించాడు. అతడు మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. రాహుల్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. నీకు, ఈ సినిమాలోని పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్‌ బాలా మేకింగ్ చాలా బాగుంది. చిత్ర యూనిట్ అందరికి నా అభినందనలు’ అని రష్మిక రాసుకొచ్చారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories