సూర్య కోసం రంగంలోకి ప్రభాస్!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకొని విడుదలకి సిద్దంగా ఉన్న మోస్ట్‌ అవైటెడ్ సౌత్ సినిమాల్లో కోలీవుడ్ భారీ ప్రాజెక్ట్ “కంగువా” మూవీ కూడా ఒకటి. మరి దర్శకుడు శివ అలాగే హీరో సూర్య కాంబోలో చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ ప్రాజెక్ట్ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది.

మరి ఈ సినిమా విడుదలకి సమయం దగ్గరకి వస్తుండగా మేకర్స్ సాలిడ్ ప్లానింగ్స్  చేస్తున్నారు. అలా ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ని కూడా దింపే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో ఓ టాక్‌ నడుస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

మరి వీరికి ప్రభాస్ కి ఉన్న మైత్రి గురించి  అందరికీ చెప్పాల్సిన పని లేదు అలా కంగువా ప్రీ రిలీజ్ కోసం డార్లింగ్ హీరో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories