ఇప్పటికీ ట్రెండింగ్‌ లో అజ్ఙాతవాసి పాటనా?

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఎపిక్ డిజాస్టర్ సినిమా “అజ్ఞాతవాసి” కూడా ఓ సినిమా. పవన్ అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో దీనిపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కాదు. దానికి తగ్గట్టుగానే సినిమా భారీ ఓపెనింగ్స్ ని కూడా సాదించింది కానీ ఫైనల్ గా ప్లాప్ గానే మిగిలింది.

అయితే ఈ సినిమా విషయంలో అనిరుధ్‌ ఇచ్చిన ఆల్బమ్ మాత్రం క్లాసిక్ గా నిలిచిపోయిందని చెప్పుకొవచ్చు. అందులో త్రివిక్రమ్, పవన్ మార్క్ మెలోడీ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని తెగ ఊపేశాయి. మరి ఎప్పుడో 2018లో వచ్చిన ఈ సినిమా, పాటలు.. ఇప్పుడు ట్రెండింగ్ లో కనిపించడం సర్ప్రైజింగ్ అని చెప్పుకొవచ్చు.

మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ స్పాటిఫైలో హైదరాబాద్ వరకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు వీక్ టాప్ 10 ట్రెండింగ్ పాటల్లో పలు రీసెంట్ సినిమాల పాటలతో పాటుగా అజ్ఞాతవాసి నుంచి ‘గాలి వాలుగా’ సాంగ్ టాప్ 10 లో నిలిచింది. ఇది మాత్రం సర్ప్రైజింగ్ అని చెప్పాలి. ఎప్పుడు 2018 సినిమా ఇప్పుడికీ శ్రోతల ప్లే లిస్ట్ లో ట్రెండింగ్ లో ఉండేలా ఉంది ఈ పాట. కానీ దురదృష్టవశాత్తు సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories