ఆగ్రహాం వ్యక్తం చేసిన లోకేష్‌ కనగరాజ్‌!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా డైరెక్టర్‌  లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న భారీ సినిమ “కూలీ” కూడా ఒకటి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది అన్నట్టుగా కూడా టాక్ నడుస్తుంది.

అయితే అనూహ్యంగా రజినీకాంత్ అనారోగ్యానికి గురి కావడం ఊహించనిదిగా మారింది. అయితే రజినీకాంత్ ఆరోగ్యం కూలీ షూటింగ్ వల్లే పాడైంది అని తాను షూటింగ్ లో ఉన్నపుడే అస్వస్థతకి లోనయ్యారాని యూట్యూబర్స్ వార్తలు ప్రచారం చేశారు. అయితే దీనిపై లోకేష్ కనగరాజ్ ఓ క్లారిటీ ఇచ్చాడు. యూట్యూబర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఫేక్ వార్తలని అమ్మేస్తున్నారని రజినీ గారి సర్జరీ ముందే ప్లాన్ చేసుకున్నారు. అంతే కానీ రజినీ కూలీ మూవీ షూటింగ్ లో ఎలాంటి అస్వస్థతకి గురి కాలేదు. అందులో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా మీడియా ముందు వివరించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories