సనాతన ధర్మంకోసం నిప్పులు చెరగిన పవన్!

పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. కఠినమైన నియమాలను పాటించారు. ఈ దీక్ష చేసిన 11 రోజుల పాటు చాలా పరిమితంగా మాత్రమే ఆహారం తీసుకున్నారు. ఉపవాసాలు చేశారు. దీక్ష ఉపసంహరించడం కోసం 12వ రోజున పవన్ కల్యాణ్ తిరుమలకు వచ్చారు. అలిపిరి నుంచి తిరుమలకు నడిచివెళుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ అలసటకు, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నిత్యం జిమ్ చేసే అలవాటున్న ఈ ప్రజానాయకుడు తిరుమలకు కాలినడకన వెళ్లడానికి అంతగా ఇబ్బంది పడడం ఏమిటి? అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ, 11 రోజుల పాటు ఉపవాసాలతో ప్రాయశ్చిత దీక్షచేసిన ప్రభావం అది. ఆ అస్వస్థతతోనే కాలిబాటలోనే తిరుమల చేరుకుని, మరురోజు స్వామివారిని దర్శించుకున్న తరువాత.. పవన్ కు జ్వరం తగిలింది.

పవన్ కల్యాణ్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆయన బసచేసిన అతిథిభవనంలోనే వైద్యులు ఆయనకు చికిత్సలు అందించారు. ఇన్ని జరిగినా సరే.. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ కల్యాణ్ తిరుమల దేవుడికి ద్రోహం తలపెట్టిన వారి మీద వీర బీభత్సమైన స్థాయిలో నిప్పులు చెరిగారు.

సనాతన ధర్మానికి ద్రోహం తలపెడితేసహించేది లేదంటూ ఆయన విద్రోహలు మీద విమర్శల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలొంలోను, అంతకు ముందు కూడా తాను పార్టీ స్థాపించిన నాటినుంచి తన మీద అనేక రకాల వ్యక్తిగత విమర్శలు చేశారని, హేళన చేశారని, అవమానకరంగా మాట్లాడారని.. ఏనాడు కూడా తాను సీరియస్ గా తీసుకోలేదని పవన్ అన్నారు. తనను ఎన్ని అన్నా ఊరుకున్నాను గానీ.. సనాతన ధర్మానికి ద్రోహం తలపెడితే, దేవుడికి అపచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు.

తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ విషయంలో జంతుకొవ్వులు కలిశాయనే ఆరోపణలు వచ్చిన తర్వాత.. పవన్ కల్యాణ్ ఈ రేంజిలో అలాంటి ద్రోహం చేసిన వారి మీద విరుచుకుపడడం ఇదే తొలిసారి. గతంలో కూడా వీరు చేస్తున్న తప్పులను ఆయన ప్రస్తావించినప్పటికీ.. పవన్ కల్యాణ్ వారాహి సభలో తీవ్రస్వరంలో అందరినీ హెచ్చరించారు. ధర్మద్రోహానికి ఒడిగడుతున్న దుర్మార్గులను మాత్రమే కాదు కదా.. మతాల పట్ల అనుచిత, దుర్మార్గపు సంఘటనలు జరిగినప్పుడు ఒక్కో మతం విషయంలో ఒక్కో తీరుగా స్పందించే కుహనా లౌకికవాదులను కూడా పవన్ ఎండగట్టారు. సనాతన ధర్మానికి, హిందూ దేవుళ్లకు అవమానం జరిగితే ఒక రకంగా, ఇస్లాం మతానికి అవమానం జరిగితే మరో రకంగా స్పందించడం ఈ దేశంలో ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. పవన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంలో కోర్టులను కూడా ఉపేక్షించకపోవడం విశేషం. పవన్ చెప్పిన సంగతుల్లో ప్రతి మాట కూడా ధర్మాగ్రహమేనని ప్రజలు అనుకుంటుండడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories