పుష్ప 3 గురించి వదంతులు!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా పుష్ప 3 గురించి ఓ రూమార్‌ మొదలైంది. పుష్ప-2 సినిమా ఎండింగ్‌ లో మూడో పార్ట్ గురించి ఓ అదిరిపోయే లీడ్ ను దర్శకుడు సుకుమార్ సాలిడ్ గా ప్లాన్ చేశాడని.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని, అది మూడో పార్ట్‌కు లీడ్‌గా మారుతుందని తెలుస్తుంది.

అయితే, ఈ రూమార్ల ప్రచారం పై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక ‘పుష్ప-2’ డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్ గా నటిస్తుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories